
తన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో ఇటు తెలుగులోనే కాక, సౌతిండియాలోని ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్‌తో పాటు ఆయన డ్యాన్సుల్లోనూ దుమ్ము దులిపేస్తారు. ఇప్పటివరకూ సౌతిండియాకే పరిమితమైన ఆయన డాన్స్, యాక్టింగ్‌ను చూసే భాగ్యం ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకూ దక్కనుంది. ఏబీసీడీ (ఎనీబడీ కెన్ డాన్స్) పేరుతో గతంలో విడుదలైన సినిమా చక్కటి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇదే సినిమాకు ఏబీసీడీ 2 పేరుతో సీక్వెల్ తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఇందులో అల్లు అర్జున్ సౌతిండియా బెస్ట్ డాన్సర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. కేవలం ఒక్క పాటకే పరిమితం కాకుండా, సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవా విలన్‌గా నటిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ తెరపై ఎంట్రీ ఇచ్చినట్టే. సినిమాను జూన్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.