
కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పింది. అంతగొప్ప రుద్రమదేవి ఘనతని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. ఈ సినిమాలో టైటిల్ రోల్ అనుష్క చేస్తోంది, అలాగే రుద్రమదేవి జీవిత కథలో చాలా కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే ఈ సినిమా ఆడియోని మరియి ట్రైలర్స్ ని రిలీజ్ చేసారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసంఉన్న సాగతీ తెలిసిందే. గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆ పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తన లుక్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నాడో అంతకన్నా ఎక్కువ కేర్ ని డబ్బింగ్ విషయంలో తీసుకున్నాడు. గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ ప్యూర్ తెలంగాణ యాసలో మాట్లాడాలి. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేసి రుద్రమదేవికి డబ్బింగ్ చెప్పాడు. నేటితో అల్లు అర్జున్ తను చేసిన గోనగన్నా రెడ్డి పాత్రకి సంబందించిన డబ్బింగ్ వర్క్ ని ఫినిష్ చేసాడు. ఇక రుద్రమదేవి విషయంలో అల్లు అర్జున్ ప్రమోషన్స్ లో పాల్గొనడం తప్ప చేయాల్సింది ఏమీ లేదు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దసహ్కు చేరుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 22న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.