త్రివిక్రమ్ సినిమా కోసం 10 కేజీల బరువు తగ్గిన అల్లు అర్జున్.

Allu-Arjun
‘పిల్లా నువ్వులేని జీవితం’ ఆడియో విడుదల కార్యక్రమంలో అల్లు అర్జున్ లుక్ చూసినవారు ఆశ్చర్యపోయారు. చాలా స్లిమ్ గా, రొమాంటిక్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమా కోసం దాదాపు 10 కేజీల బరువు తగ్గాడని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ముగ్గురు అందాల భామలు సమంత, అదా శర్మ,నిత్యా మీనన్ లతో రొమాన్స్ చేస్తున్నాడు. లవర్ బాయ్ లుక్ కోసం వెయిట్ తగ్గాడు, రొమాంటిక్ గా మారాడు.

‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో బందిపోటుగా పోరాట యోధుడిగా కనిపించడం కోసం అల్లు అర్జున్ బాడీని బాగా బిల్డ్ అప్ చేశాడు. ‘రుద్రమదేవి’ షూటింగ్ జరిగినన్ని రోజులు యాక్షన్ హీరో లుక్ లో దర్శనం ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచన మేరకు ‘రుద్రమదేవి’ షూటింగ్ పూర్తయిన తర్వాత కొత్త సినిమా కోసం పాత్రకు అనుగుణంగా తనను తానూ మలచుకున్నాడు. గతంలో కూడా క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో 6 ప్యాక్ బిల్డ్ అప్ చేశాడు. ప్రతి సినిమాలో తనను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాడు అర్జున్. అందుకే అభిమానుల స్టైలిష్ స్టార్ అయ్యాడు.

Exit mobile version