
టాలీవుడ్ కి ‘దేశముదురు’ సినిమా ద్వారా తొలిసారిగా ఆరు పలకల దేహాన్ని పరిచయం చేసిన నటుడు అల్లు అర్జున్. ఆ తరువాత వరుడు సినిమాలో సైతం తన ఫిజిక్ తో, బద్రీనాధ్ చిత్రంలో సైతం తన బేర్ బాడీతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇకపై బేర్ బాడీని థియేటర్ లలో చూపించనని స్టేట్మెంట్ జారీ చేశాడు.
“మొదటిసారి చొక్కా విప్పినప్పుడు చూస్తున్న ప్రేక్షకులకు అద్భుతంగా అనిపిస్తుంది. ఆ తరువాత బోర్ కొట్టేస్తుంది. మరోసారి నా బడీ చూపించడానికి నేను కొత్తగా ఏమి చెయ్యలేదు. అయిన గత కొన్ని చిత్రాలుగా నేను యాక్షన్ జోనర్ ని వదిలేసి ఎంటర్టైనర్ బేస్ కి షిఫ్ట్ అవ్వడంతో ఇకపై తెరపై నా బాడీ చూపించే అవసరం రాదని అనుకుంటున్నట్టు” అల్లు అర్జున్ తెలిపాడు.