ఇంకో కొన్ని రోజులు ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో”కి ఏడాది పూర్తయిపోతుంది. ఈ సంవత్సరం కావస్తున్నా సరే ఈ సినిమా హవా మాత్రం ఇప్పటికీ ఏదొక కేటగిరీలో కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అయితే ఈ సినిమా కు బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచిన సంగీతం ఎన్నో వండర్స్ నమోదు చేసింది.
యూట్యూబ్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు సంచలన రికార్డులను నమోదు చేసిన ఈ చిత్రం లేటెస్ట్ గా మరో రెండు ఫీట్స్ ను అందుకుంది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ లో ఈ 2020 ఏడాదిలో అత్యధికంగా స్ట్రీమ్ చేయబడిన తెలుగు ఆల్బమ్ గా నెంబర్ 1 స్థానంలో నిలవగా జియో సావన్ లో అయితే ఆల్ టైం రికార్డునే సెట్ చేసినట్టుగా తెలుస్తుంది.
దాన్ని స్వయంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు థమనే తెలిపాడు. జియో సావన్ లో “అల వైకుంఠపురములో” ఆల్బమ్ కు గాను ఏకంగా 178.7 మిలియన్ స్ట్రీమింగ్స్ తో సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పినట్టు తెలిపారు. దీనితో బన్నీ సినిమా సెన్సేషన్ ఇంకా ఆగలేదు అని చెప్పి తీరాలి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా గీతా ఆర్ట్స్ మరియు హారికా హాసిని వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెల్సిందే.
178.7M STREAMS ALL NEW RECORD FOR AN SOUTH INDIAN ALBUM OF THE YEAR ???????? #AlaVaikunthapurramuloo #AVPL ✌????#UNSTOPPABLEAVPLALBUM ???????? pic.twitter.com/zfS2IAHY2h
— thaman S (@MusicThaman) December 21, 2020
