10 కేజీల వెయిట్ తగ్గిన అల్లు అర్జున్

Allu-Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘జులాయి’ తర్వాత అల్లు అర్జున్ మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి ఇదివరకే తెలియజేశాం. అలాగే చాలా రోజుల క్రితమే లాంచ్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ సినిమా కోసం స్లిమ్ అండ్ ఫిట్ గా తయారవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ స్పెషల్ వర్కౌట్స్ చేసి10 కేజీల వెయిట్ కూడా తగ్గాడు. అలాగే ఈ చిఎన్మా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు భామలు జోడీ కట్టనున్నారు. అందులో ఇప్పటికే సమంత, ఆద శర్మ హీరోయిన్స్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. అల్లు అర్జున్ కి గట్టి పోటీని ఇచ్చే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నాడు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులాయి’ సినిమాని మనకు అందించిన కె. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

Exit mobile version