తెలుగు స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ క్రేజ్ చాలా ప్రత్యేకమైంది. ఆయన అభిమానుల్లో ఎక్కువగా యువత యువకులే ఉంటారు. అందుకు కారణం బన్నీ స్టైల్. ప్రతి సినిమాకి కొత్త లుక్, డ్రెస్ కోడ్ మారుస్తుంటాడు. ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ పరంగా అప్డేట అవుతూంటాడు. పైగా బన్నీ ఫాలో అయ్యేది వరల్డ్ క్లాస్ స్టైల్. అందుకే ఆయన్ను ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు.
బన్నీ తన కాస్ట్యూమ్స్ కొనుగోలు చేయడం కోసం దుబాయ్, పారిస్ లాంటి ఖరీదైన ప్రాంతాలకే వెళతారు. కొత్త ఆయన చిత్రం ‘అల వైకుంఠపురములో’ని పాపులర్ సాంగ్ ‘సామజవరగమన’ పాటను పారిస్ లొకేషన్లో షూట్ చేస్తున్నారు. ఈ పాటలో అల్ట్రా స్టైలిష్ గా కనిపించడం కోసం కేవలం ఫేమస్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన డిజైనర్ దుస్తులనే వాడనున్నారట బన్నీ. ఈ దుస్తుల్ని ఆయన తన బృందంతో కలిసి పారిస్ లోనే కొనుగోలు చేశారు. సో.. మరోసారి బన్నీ నుండి స్టైలిష్ ట్రీట్ ఖాయమన్నమాట.
ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా టబు, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
