యుట్యూబ్లో అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ రికార్డులు.

allu-arjun
‘ఐ యాం దట్ చేంజ్’ పేరుతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా నటించి నిర్మించిన షార్ట్ ఫిల్మ్ ఇంటర్నెట్ లో రికార్డులు సృష్టిస్తుంది. యుట్యూబ్లో ఈ షార్ట్ ఫిల్మ్ ను ఇప్పటివరకు 15 లక్షల మంది చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఒక స్టార్ హీరో నటించిన షార్ట్ ఫిల్మ్ ఈ రేంజ్లో పాపులర్ కావడం విశేషమే. అసలు యుట్యూబ్లో ‘ఐ యాం దట్ చేంజ్’ విడుదల చేసిన 48 గంటల్లో 8 లక్షల మంది ప్రేక్షకులు చూశారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ ‘ఐ యాం దట్ చేంజ్’ షార్ట్ ఫిల్మ్ కు సుకుమార్ దర్శకత్వం వహించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. అల్లు అర్జున్ చేసిన ఈ ప్రయత్నాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. మన భాద్యత మనం నిర్వర్తించడం కూడా దేశ భక్తే అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ అభిమానులలో చైతన్యాన్ని కలిగించింది. మార్పు మొదలవుతుందని ఆశిద్దాం.

‘ఐ యాం దట్ చేంజ్’ షార్ట్ ఫిల్మ్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Exit mobile version