
భారీ బడ్జెట్ మరియు భారీ సెట్టింగుల దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో కనిపించనున్నాడు. మామూలుగా బన్ని ఏ చిన్న పాత్ర చేయాలన్నా ఆ పాత్రకి తగ్గట్టు తన లుక్ మరియు ఫిజిక్ ని మార్చుకుంటాడు. ఇప్పుడు కూడా గోనగన్నా రెడ్డి పాత్ర కోసం ముంబైలో స్పెషల్ గా హార్స్ రైడింగ్, కత్తి యుద్ధంతో పాటు ఫిట్ నెస్ పరంగా కూడా బన్ని ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
మరి కొద్ది వారాల్లో అల్లు అర్జున్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని రుద్రమదేవి షూటింగ్ లో పాల్గొంటాడు. ఆలాగే అల్లు అర్జున్ పోషించే గోన గన్నారెడ్డి పాత్రకి జోడీగా కనిపించే అనామికాదేవి పాత్రలో కేథరిన్ కనిపించనుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ ప్రత్యేక సెట్లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అనుష్క రుద్రమదేవిగా కనిపించనున్న ఈ సినిమాలో రానా, కృష్ణంరాజు, నిత్యా మీనన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్, సుమన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా 3డిలో తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

