పుష్ప రాజ్ పరిచయానికి సన్నాహాలు మొదలు

Pushpa dubbing

ప్రేక్షకులకు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న టాలీవుడ్ సినిమాల్లో అల్లు అర్జున్ ‘పుష్ప’ కూడ ఒకటి. సుకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. ‘రంగస్థలం’ హిట్ తర్వాత సుకుమార్, ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ తరవాత బన్నీ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సర్వత్రా అమితాసక్తి నెలకొంది ఉంది. సినిమాల్లో అన్ని అంశాల్లో ప్రేక్షకుల్ని ఎక్కువగా ఎగ్జైట్ చేస్తున్న అంశం బన్నీ క్యారెక్టరైజేషన్, లుక్. ఇందులో అల్లు అర్జున్ డీగ్లామర్ లుక్ ట్రై చేశారు. అందులోనూ స్మగ్లర్ పాత్ర. ఫస్ట్ లుక్ జనాలకు విపరీతంగా నచ్చింది. ఇటీవలే రిలీజ్ చేసిన ప్రీల్యూడ్ అంచనాల్ని డబుల్ చేసింది.

రేపు సాయంత్రం 4 గంటలకు పుష్పరాజ్ పాత్రను పరిచయం చేయనున్నారు. అందుకే డబ్బింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అల్లు అర్జున్ ఈరోజు నుండి తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. ముందుగా పుష్ప రాజ్ ఇంట్రో టీజర్ కోసం డబ్బింగ్ కంప్లీట్ చేయనున్నాడు బన్నీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. బన్నీ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మితమవుతున్న సినిమా ఇది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

Exit mobile version