బన్నీ అండ్ టీమ్ రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నారా ?

Ala Vaikunthapuramulo1

రాబోయే సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో, సరిలేర నీకెవ్వరు’ సినిమాలు పోటీ పడుతుండటంతో వాతావరణం ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. మొదట రెండు చిత్రాలు జనవరి 12నాడే వస్తాయని ప్రకటించడంతో అభిమానులు సైతం కంగారుపడ్డారు. కానీ తర్వాత ‘సరిలేర నీకెవ్వరు’ 11కు మారడంతో పోటీ తగ్గి రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ దక్కడానికి వీలు కలిగింది.

అయితే ఈరోజు ఉదయం నుండి ‘అల వైకుంఠపురములో’ చిత్రం 12నుండి 10వ తేదీకి మారే అవకాశం ఉందనే వార్తలు మొదలయ్యాయి. ఔట్ పుట్ బాగుండటంతో బన్నీ అండ్ టీమ్ రెండు రోజులు ముందుగానే సినిమాని విడుదల చేయాలని, తద్వారా భారీ ఓపెనింగ్స్ సాధించవచ్చనే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినబడుతోంది. దీంతో మరోసారి గందరగోళం మొదలైంది. మరి నిజంగానే బన్నీ బృందం విడుదల తేదీలో మార్పు చేయనున్నారా.. లేదా అనేది ఈ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version