
గత కొన్నేళ్లుగా తమిళ చిత్రాలు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో భారీ విజయాలను నమోదు చేయలేకపోతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన రజనీకాంత్ ‘కూలీ’, సూర్య ‘కంగువా’ లాంటి పాన్-ఇండియా ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేక తీవ్ర నిరాశను మిగిల్చాయి.
ఇప్పుడు కోలీవుడ్ ఆశలన్నీ రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’ పైనే ఉన్నాయి. విజయ్ సినిమాలకు విరామం ఇవ్వడం, అజిత్ గ్యాప్ తీసుకోవడం, సూర్య-ధనుష్ వంటి వారు పాన్-ఇండియా మార్కెట్‌పై పట్టు కోల్పోవడంతో తమిళ ఇండస్ట్రీకి ప్రస్తుతానికి ఈ చిత్రమే పెద్ద హోప్.
నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సీక్వెల్‌కు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సినిమాను అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి ‘జైలర్ 2’ తమిళ ఇండస్ట్రీ ఆశలను నెరవేరుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.