మొత్తానికి బన్నీ టైటిల్ మార్చేశారుగా…

మొత్తానికి బన్నీ టైటిల్ మార్చేశారుగా…

Published on Sep 28, 2019 8:32 PM IST

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల కలయికలో వస్తున్నటువంటి తాజా చిత్రం అల వైకుంఠపురంలో… వీరికలయికలో ఇంతకుముందు వచ్చినటువంటి రెండు చిత్రాలు కూడా ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో మనందరికీ తెలిసిందే. కాగా తాజాగా వీరి కలయికలో వస్తున్నటువంటి మూడవ చిత్రం కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని దర్శకనిర్మాతలు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం. ఇంతకు ఆ నిర్ణయం ఏంటంటే… టైటిల్ ని కొద్దిగా మార్చాలని అనుకుంటున్నారట… అది తెలుగులో కాదండోయ్… ఇంగ్లీష్ పేరులో. అంటే ఈ టైటిల్ ని ఇది వరకు Ala Vaikuntapuramlo… అని ప్రమోట్ చేయగా, ఇపుడు కొత్తగా న్యూమరాలజీ ప్రకారం ఈ ఇంగ్లీష్ టైటిల్ కి మరొక R చేర్చి Ala Vaikuntapurramlo… అని ప్రమోట్ చేయనున్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన వారు సెంటిమెంట్ ని ఎంతలా ఫాలో అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి వీరి సెంటిమెంట్ ఎంతలా వర్కవుట్ అవుతుందో చూడాలి మరి…

సంబంధిత సమాచారం

తాజా వార్తలు