ఫోటో మూమెంట్ : ఐకాన్ స్టార్ కేరాఫ్ నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా!

Allu Arjun 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల వీరి కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై అధికారికంగా ప్రకటన చేశారు. ఇక ఈ మూవీతో బన్నీ ఈసారి పాన్ వరల్డ్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

అల్లు అర్జున్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడూ స్టైలిష్ వేర్‌తో కనిపిస్తుంటాడు. అయితే, తాజాగా అల్లు అర్జున్ వేసుకున్న ఓ టీ-షర్ట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ముంబై ఎయిర్ పోర్ట్‌లో బన్నీని ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించగా.. ఆయన వేసుకున్న టీ-షర్ట్‌పై బ్రహ్మానందం నటించిన ఓ సినిమాలోని ఫోటోలు ఉండటం.. ఆ క్యారెక్టర్ పేరును బన్నీ టీ-షర్ట్ పై చూసి సోషల్ మీడియాలో ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. మీమర్స్‌కు ఎంతో ఇష్టమైన ‘‘నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా’’ ఫోటోలు మనకు బన్నీ టీ-షర్ట్ పై కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ఫోటోలను నెట్టింట అభిమానులు వైరల్ చేస్తున్నారు. బన్నీ కూడా బ్రహ్మీ డై హార్డ్ ఫ్యాన్ అంటూ మీమర్స్ ఈ ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.

Exit mobile version