టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 6న నయనికా రెడ్డితో శిరీష్ మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ క్రమంలో అల్లు వారి ఇంట్లో పెళ్లి పనులు వేగవంతం అయ్యాయి. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సాగుతున్న ఈ వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
పెళ్లి పిలుపుల్లో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దంపతులు, అల్లు శిరీష్‌తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు నివాసానికి వెళ్లారు. పవన్, లెజినోవా దంపతులకు స్వయంగా పెళ్లి పత్రికను అందించి వివాహానికి ఆహ్వానించారు. అటు నాగబాబు దంపతులకు కూడా పెళ్లి పత్రికను అందించి వివాహానికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, తమ్ముడి పెళ్లిని పురస్కరించుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సన్నిహితులు మరియు సినీ ప్రముఖుల కోసం ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. మార్చి 6న జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం అటు మెగా కుటుంబం, ఇటు అల్లు కుటుంబం ఎంతగానో ఎదురుచూస్తున్నాయి.
