అల్లు శిరీష్ కొత్త సినిమా లాంచ్

Allu-Sirish

‘గౌరవం’ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఆ తర్వాత ‘కొత్త జంట’ సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కొత్త జంట’ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న శిరీష్, తాజాగా ఈరోజే మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశారు. ‘యువత’, ‘ఆంజనేయులు’, ‘సోలో’ సినిమాలతో మెప్పించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘సారొచ్చారు’ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ఇదే!

ఈ ఉదయం అల్లు శిరీష్ కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఓ మంచి లవ్‌స్టోరీతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని శిరీష్ ఈ సందర్భంగా తెలిపారు.

Exit mobile version