టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ వివి వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తనయుడు బెల్లంకొండ సాయిని హీరోగా పరిచయం చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర టీం ఈ సినిమా విశేషాలను తెలియజేశారు.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆడియోని జూన్ 29న ర్లీజ్ చేస్తామని, అలాగే సినిమాని జూలై 24న సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే సాయి శ్రీనివాస్ – బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సినిమాకి హైలైట్ అవుతుందని తెలియజేశారు. సాయి శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు
