
శ్రీ హయగ్రీవ క్రియేషన్స్ పతాకంపై జె.రామారావు నిర్మించిన సినిమా అలౌకిక. చల్లా భానుకిరణ దర్శకత్వంలో హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు (ఏప్రిల్ 23న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో, ఆత్మ, దెయ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఓ సరికొత్త ప్రయత్నమే ఈ అలౌకిక సినిమా అని దర్శక నిర్మాతలు తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు ప్రేక్షకులకు ముందుకు రానుందని చిత్ర యూనిట్ తెలిపింది.
బ్రహ్మాజీ, మనోజ్ నందం, హరిణి ప్రధాన పాత్రల్లో నటించగా ఈ సినిమాకు ప్రమోద్.కె. సంగీతాన్ని సమకూర్చారు. పి. సూర్యప్రకాష్ రావు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. అలౌకిక సినిమా రచన, దర్శకత్వ బాధ్యతలను చల్లా భానుకిరణ్ నిర్వహించారు. రేపు విడుదలవనున్న ఈ సినిమా అందరికీ నచ్చే సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.