సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్ ల కలయికలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చేస్తున్న భారీ చిత్రం వారణాసి కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఇండియన్ సినిమా నుంచి డైరెక్ట్ హాలీవుడ్ ఆడియెన్స్ నే టార్గెట్ చేసి మంచి బజ్ ని సొంతం చేసుకున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు.
అయితే ఇదే పాపులారిటీ చూసి హిందీ మార్కెట్ లో కొందరు తమ అక్కసు ఇప్పుడు వెళ్లగక్కుతున్నారని చెప్పవచ్చు. తాజాగా వారణాసి టీం మెక్సికోలో జరుగుతున్నా కామిక్ కాన్ ఈవెంట్ లో తమ ప్రెజెన్స్ అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో అసలు వారణాసి టీంకి సరైన స్పందన దక్కలేదు అని అక్కడ జనమే లేరు అంటూ కొన్ని ఫోటోలు వైరల్ చేస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో బాలీవుడ్ కి చెందిన కొన్ని హ్యాండిల్స్ వీటిని ప్రచారం చేస్తుండటం గమనార్హం. దీనితో వారణాసి సినిమాపై ఉన్న మంట తోనే అప్పుడే నెగిటివ్ స్టార్ట్ చేసారా అనిపించక మానదు. సో ఫ్యూచర్ లో డెఫినెట్ గా జక్కన్న వీటికి గట్టి బదులే ఇస్తారని చెప్పవచ్చు.
