అట్లీ – అల్లు అర్జున్.. అప్పుడే క్రేజీ ప్రమోషన్స్!

allu rjun atlee

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ క్రేజీ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం ఇపుడు అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాని అనౌన్సమెంట్ చేయడం అనేది ఊహించని అంశంగా మారింది. అయితే ఈ చిత్రం ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టుకోలేదు కానీ అప్పుడే మాస్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడం షాకింగ్ గా మారింది.

నిన్న జరిగిన హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ లో ఈ సినిమా అనౌన్సమెంట్ తాలూకా వీడియోలో ఎల్ఈడీస్ లో ప్లే చేయడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనితో మేకర్స్ తమ సినిమాని ఏ రేంజ్ లో ఇపుడు నుంచే ప్రమోషన్ చేసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నుంచే ఈ లెవెల్లో ఉంటే ఇక సినిమా మొదలై రిలీజ్ అయ్యేసరికి ఎలా ఉంటుందో చూడాల్సిందే మరి. ఇక ఈ భారీ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తుండగా అతి త్వరలోనే షూటింగ్ ఈ చిత్రం మొదలు పెట్టుకోనుంది.

Exit mobile version