మంచు విష్ణు సినిమాలో అమలా పాల్

vishnu-amalapaul

‘డైనమైట్’ లాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమా తర్వాత మంచు విష్ణు హీరోగా ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘సరదా’. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ పై డి.కుమార్‌, పల్లి కేశవరావు నిర్మాతలుగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక బడోరియా హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇటీవ‌లే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ కాకుండా ఓ కీలక పాత్రలో మరో హీరోయిన్ కనిపిస్తుంది అని షూటింగ్ మొదలు పెట్టన రోజున తెలియజేశారు.

తాజా సమాచారం ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం మలయాళ బ్యూటీ అయిన అమలా పాల్ ని సెలక్ట్ చేసారు. అమలా పాల్ గతంలో నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత అమలా పాల్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్‌, పృథ్వీ, వెన్నెలకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version