కమల్ హాసన్, అమల కాంబినేషన్‌లో సినిమా!

amala
విశ్వనటుడు కమల్ హాసన్ తెలుగు, తమిళ భాషల్లో చేసిన ‘చీకటి రాజ్యం’ (తూంగవనం) అనే సినిమా దీపావళి కానుకగా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. నవంబర్ 10న తమిళ వర్షన్ తూంగవనం విడుదల కానుండగా, నవంబర్ 20న చీకటి రాజ్యం విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ‘చీకటి రాజ్యం’ ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్‌ వచ్చిన కమల్, తన తదుపరి సినిమా విశేషాలను పంచుకున్నారు. కమల్ తన తదుపరి సినిమాను మళయాల సినీ దర్శకుడు టి. కె. రాజీవ్ దర్శకత్వంలో చేయనున్నారు.

అమెరికా నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో కమల్ సరసన అమల అక్కినేని, జరీన్ వాహిబ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ఈ మధ్య కాలంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి అందమైన సినిమాలో మంచి పాత్రను పోషించి సూపర్ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. ఇక తాజాగా ఉలగనయగన్ కమల్ హాసన్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించనుండడం ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం.

Exit mobile version