రాహుల్ సిప్లిగంజ్ పాట.. ఆనీ మాస్టర్ ఆట.. ‘అవ్వల్ దావత్’ సాంగ్ వైరల్!

Ameer

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘అవ్వల్ దావత్’ అనే మాస్ గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది.

రాహుల్ సిప్లిగంజ్ తనదైన జోష్‌తో ఆలపించిన ఈ పాటలో, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ వేసిన మాస్ స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యూట్యూబ్‌లో విడుదలైన కొద్ది సమయంలోనే ఈ పాట ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటి ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. గతంలో హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, ఎస్‌వికె సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version