‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కాసుల కళ’ అనే లిరికల్ పాటను చిత్ర బృందం విడుదల చేసింది.
మధ్యతరగతి జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ గీతానికి నిఖ్లేష్ సుంకోజి సాహిత్యం అందించగా, స్మరణ్ సాయి సంగీతం సమకూర్చారు. ఏక్నాథ్ ఈ పాటను అలరించేలా ఆలపించారు. పక్కా హైదరాబాద్ లోకల్ ఫ్లేవర్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాకు ఎస్వీకే ఛాయాగ్రాహకుడిగా, రోహిత్ పెనుమత్స ఎడిటర్‌గా వ్యవహరించారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహించారు. కాగా, రానా దగ్గుబాటి నేతృత్వంలోని ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
