‘అమీర్ లోగ్’ చిత్రం నుంచి ‘కాసుల కళ’ పాట విడుదల.. ఆగస్టు 21న సినిమా రిలీజ్!

Ameer Log

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కాసుల కళ’ అనే లిరికల్ పాటను చిత్ర బృందం విడుదల చేసింది.

మధ్యతరగతి జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ గీతానికి నిఖ్లేష్ సుంకోజి సాహిత్యం అందించగా, స్మరణ్ సాయి సంగీతం సమకూర్చారు. ఏక్‌నాథ్ ఈ పాటను అలరించేలా ఆలపించారు. పక్కా హైదరాబాద్ లోకల్ ఫ్లేవర్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సినిమాకు ఎస్వీకే ఛాయాగ్రాహకుడిగా, రోహిత్ పెనుమత్స ఎడిటర్‌గా వ్యవహరించారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహించారు. కాగా, రానా దగ్గుబాటి నేతృత్వంలోని ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Click here for Song

Exit mobile version