కెరీర్ ఆరంభంలోనే మంచి కథ దొరికింది.. ‘అమీర్ లోగ్’ నటీనటుల ఆనందం

రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ సమర్పిస్తున్న తాజా చిత్రం ‘అమీర్ లోగ్’ ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదలవుతోంది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ పతాకంపై మాధవి రెడ్డి సోమ ఈ చిత్రాన్ని నిర్మించగా, రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్‌లో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.

​ఈ సందర్భంగా దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రదర్శించిన ప్రీమియర్లకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభించిందని తెలిపారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఒక విభిన్నమైన అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని నిర్మాత మాధవి రెడ్డి వెల్లడించారు.

​కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి మంచి కథలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని నటీనటులు ఎంసీ హరి, మనోజ్, వేద జలంధర్ పేర్కొన్నారు. సినిమాలో సహజత్వంతో పాటు స్మరణ్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి రోహిత్ పెనుమత్స ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Exit mobile version