ఫైనల్ గా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’.. కానీ

Sitaare-Zameen-Par

బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకరైన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన రీసెంట్ సినిమానే సితారే జమీన్ పర్. డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అమీర్ రేంజ్ హిట్ అయితే కాలేదు కానీ తన గత చిత్రం లాల్ సింగ్ చద్దా కంటే బెటర్ అనిపించుకుంది. అయితే సితారే జమీన్ పర్ విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పుడు ఎన్నో నెలల తర్వాత ఓటీటీ లోకి రాబోతుంది.

తను తన సినిమాల వ్యవహారం పూర్తిగా ఓటీటీ లకి వ్యతిరేకం అని ఓపెన్ గానే తన సినిమా ఓటీటీ లకి ఇవ్వను అని అమీర్ అప్పట్లోనే తెలిపారు. ఈ నాలుగు వారాలు ఎనిమిది వారాల ఓటీటీ రిలీజ్ లు థియేట్రికల్ గా సినిమాలని దెబ్బ తీస్తున్నాయని ఆ మధ్య తెలిపారు. కానీ ఫైనల్ గా ఇప్పుడు తన సినిమా ఓటీటీ లోకి రాబోతుంది. ఈ సినిమాని సోని లివ్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ ఏప్రిల్ 3 నుంచి అందుబాటులో ఉంటుంది అని నిన్ననే ఖరారు చేసారు.

కానీ ప్రస్తుతానికి అయితే హిందీ వరకే తెస్తున్నారు. తెలుగు సహా ఇతర డబ్బింగ్ భాషలపై ఎలాంటి క్లారిటీ లేదు. మేకర్స్ ఒరిజినల్ తోనే తెలుగు డబ్ కూడా అప్పట్లో కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు ఓటీటీ వరకు మాత్రం స్కిప్ చేసేయడం తెలుగు ఆడియెన్స్ కి డిజప్పాయింట్ చేసే అంశమే అని చెప్పాలి. ఇక ఈ సినిమాని దర్శకుడు ఆర్ ఎస్ ప్రసన్న తెరకెక్కించారు.

Exit mobile version