
బుల్లితెరపై అందరినీ నవ్వించిన ‘అమృతం’ సీరియల్ కి కొనసాగింపుగా తీసిన సినిమా ‘అమృతం – చందమామలో’. గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మే 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ వచ్చింది. బుల్లితెర కంటే ఎక్కువగా వెండితెరపై నవ్వించగలమని ఈ చిత్ర టీం అంటోంది. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అవి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రేంజ్ లో ఉంటాయని డైరెక్టర్ తెలిపాడు.
శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, వాసు, హరుష్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి శ్రీ మ్యూజిక్ అందించాడు.