దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. కాగా ఈ చిత్రం 2026 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఈ సినిమాలో సీనియర్ నరేష్ ‘స్వతంత్ర బాబాయ్’గా కనిపించబోతున్నాడు. ఐతే, ‘స్వతంత్ర బాబాయ్’ పాత్ర పరమ చెత్త బూతు పాత్ర అని.. సినిమాలో ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని.. అలాగే, చాలా బోల్డ్ గా కూడా ఉంటుందని దర్శకుడు అజయ్ భూపతి చెప్పుకొచ్చాడు.
కాగా అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. కాగా తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథా నేపథ్యం సాగుతుందని.. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


