ఈ ఏడాది థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో కిరణ్ అబ్బవరం హీరోగా గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన కల్ట్ లవ్ బ్లాక్ బస్టర్ చిత్రం చెన్నై లవ్ స్టోరీ కూడా కూడా ఒకటి. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా థియేటర్లు నుంచి రీసెంట్ గానే ఓటీటీ లోకి ఎంటర్ అయ్యింది. 60 కోట్ల బ్లాక్ బస్టర్ స్ట్రీమింగ్ అంటూ సోనీ లివ్ వారు స్ట్రీమింగ్ కి తీసుకొచ్చిన ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చాక ఆడియెన్స్ నుంచి ఊహించని ఫీడ్ బ్యాక్ అందుకుంది.
థియేటర్స్ లో చూసిన ఆడియెన్స్ నుంచి దాదాపు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే ఓటీటీ ఆడియెన్స్ నుంచి మాత్రం భిన్నంగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఈ సినిమాకి వస్తుంది. దీనితో ఓటీటీ ఆడియెన్స్ కి ఈ సినిమా అంతగా ఎక్కినట్టు అనిపించలేదు అని చెప్పాలి. అయినా నిర్మాత ఎస్ కే ఎన్ ఎప్పుడూ థియేటర్స్ వైపు ఉండే మనిషే సో ఓటీటీ విషయంలో వచ్చిన టాక్ ని తను పెద్దగా పట్టించుకోరనే అనుకోవచ్చు. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. అలాగే సాయి రాజేష్ కూడా నిర్మాణం వహించారు.
