యూఎస్ మార్కెట్ లో ఆగని ‘అనగనగా ఒక రాజు’!

Anaganaga Oka Raju

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు మారి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.

అక్కడ డే 1 నుంచే సాలిడ్ నంబర్స్ ని రిజిస్టర్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం మరో సాలిడ్ మార్క్ ని అందుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అక్కడ ఈ సినిమా ప్రస్తుతం 1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇలా ఒక స్టడీ పెర్ఫామెన్స్ తో వెళుతున్న ఈ సినిమా 2 మిలియన్ కి వెళుతుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version