వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాలిడ్ నంబర్స్ తో ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju

స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు మారి తెరకెక్కించిన లేటెస్ట్ పండుగ ఎంటర్టైనర్ చిత్రమే ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). ఈ సంక్రాంతి బరిలో ఒక కల్ట్ ఎంటర్టైనర్ గా నిలిచిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించి అదరగొట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అప్పుడే 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిపోయింది.

మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 61.1 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మొదటి రోజు నుంచి యావరేజ్ గా 20 కోట్ల గ్రాస్ ని అందుకుంటూ వస్తుండడం విశేషం. అలాగే యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ ని చేస్తుంది. మొత్తానికి మాత్రం ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version