సముద్రఖని ప్రధాన పాత్రలో, రామ్ చక్రి దర్శకత్వంలో పాత్వే ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. ఆధునిక సమాజంలో డబ్బు, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 3న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి రానుంది.
“డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి” అనే సముద్రఖని వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల మోజు, క్రిప్టో పెట్టుబడులు, రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనే అత్యాశ లాంటి సమకాలీన అంశాలను టీజర్లో స్పష్టంగా చూపించారు. డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు, దాని చుట్టూ అల్లుకున్న కుటుంబ పరిస్థితులు కథలో కీలకం కానుందని అర్థమవుతోంది.
లక్ష్మీ ప్రియా చంద్రమౌళితో సముద్రఖని కుటుంబ సన్నివేశాలు ఆకట్టుకోగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను గోప్యంగా ఉంచి క్యూరియాసిటీ పెంచారు. “రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి” అని చివర్లో వచ్చే డైలాగ్ ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభినయ, కార్తిక్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
