బుకింగ్స్ లో ‘అనగనగా ఒక రాజు’ ర్యాంపేజ్.. సాలిడ్ జంప్

Anaganaga-Oka-Raju

మన టాలీవుడ్ స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు మారి తెరకెక్కించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ చిత్రమే “అనగనగా ఒక రాజు”(Anaganaga Oka Raju). మేకర్స్ ఎన్నో రోజులు ఆలస్యం అయినప్పటికీ బజ్ ని అలానే మైంటైన్ చేస్తూ వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ ని సెట్ చేసింది. మెయిన్ గా ఈ సినిమా బుకింగ్స్ భారీ లెవెల్లో కొనసాగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు బుకింగ్స్ సాలిడ్ జంప్ ని అందుకున్నాయి.

దీనితో ఈ సినిమా ఈ సంక్రాంతి మూమెంట్ లో మరింత భారీ నంబర్స్ సెట్ చేస్తుంది అని చెప్పొచ్చు. గత 24 గంటల్లో ఈ సినిమా లక్ష 80 వేలకి పైగా టికెట్స్ సేల్ చేసుకుంది. ఇది మొన్నటి కంటే చాలా ఎక్కువ సో ఈ సినిమా కూడా ఆడియెన్స్ నుంచి ఎలాంటి ఆదరణ అందుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version