రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన రోమ్ కామ్ సినిమాల్లో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఏ రేటెడ్ సినిమా ఎపిక్ కూడా ఒకటి. అయితే 90స్ బయోపిక్ సిరీస్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా దాని రేంజ్ అంచనాలు మాత్రం అందుకోవడంలో విఫలం అయ్యింది. ఇక ఫైనల్ గా థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కి సిద్ధం అయింది.
ఈ సినిమాని పాపులర్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నారు. ఇందులో ఈ అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్లు ఖరారు చేసారు. ఈ 9 నుంచి సినిమా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాకి నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మాణం వహించగా శివాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
