అన్నయ్య డేట్ లోకి ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’?

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ చిత్రం
‘రణబాలి’ కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 11 కి లాక్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఈ చిత్రం ఈ డేట్ ని మిస్ చేసుకోవడం గ్యారెంటీ అనే వినిపిస్తుంది. అయితే ఈ డేట్ ని విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆనంద్ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన రోమ్ కామ్ చిత్రమే ‘ఎపిక్’.

ఈ సినిమా నిజానికి ఈ జూలై లోనే విడుదల కావాల్సి ఉంది కానీ మిస్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ రణబాలి డేట్ లో తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version