‘రంగస్థలం’లో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ ప్రస్తుతం ‘యాత్ర’ సినిమాలో ఓ కీలక మైన పాత్రను చేస్తోంది. ఇక యాంకర్ గా అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వేరే చెప్పక్కర్లేదు. జబర్దస్త్ తో ఫేమస్ అయి.. ‘రంగస్థలం’ సినిమాతో ఆ క్రేజ్ ని రెట్టింపు చేసుకొని సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.
కాగా తాజాగా అనసూయ తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… న్యూ ప్రొఫైల్ పిక్ అని టాగ్ చేసి పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. దాంతో ఫోటో చూసిన వాళ్ళంతా ఈ ఫోటోను లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
