
కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుందని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. నాగార్జున, అనసూయల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని ఆమెను ఎంపిక చేశారు. ఓ పాటలో హీరోతో కలిసి అనసూయ స్టెప్పులు వేస్తుంది. అని ఫిల్మ్ నగర్ సమాచారం.
కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్’ తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.