ఎస్ వి బి సి చైర్మన్ గా ప్రముఖ కమెడియన్

prudvi

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన ప్రముఖ కమెడియన్ పృథ్వికి ఓ ఉన్నతమైన పదవి దక్కింది. ఆయనని శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నామినేటెడ్ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేసుకుంటూ వస్తున్న జగన్, తాజాగా ముఖ్యమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవిని పృథ్వీ రాజ్‌కు కేటాయించడం జరిగింది.

గతంలో ఈ పదవిని ప్రముఖ సినీదర్శకుడు కే రాఘవేంద్రరావు నిర్వర్తించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకు ఈ పదవిని కేటాయించింది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆయన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ ఇటీవలే పదవికి రాజీనామా చేశారు.

Exit mobile version