కళ్యాణ్ రామ్ ని మర్చిపోలేదంటున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi1

దర్శకుడు అనిల్ రావిపూడికి నిన్నటి రోజు నిజంగానే జీవితంలో మర్చిపోలేని రోజు. దర్శకుడిగా ఆయన చేసిన పెద్ద ప్రాజెక్ట్ ‘సరిలేర నీకెవ్వరు’ ప్రీరిలీజ్ వేడుక మెగాస్టార్ ముఖ్య అతిధిగా జరగ్గా అదే రోజున ఉదయం ఆయనకు కుమారుడు పుట్టాడు. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. వేదిక మీద కూడా ఇలాంటి రోజు తన జీవితంలో ఇదివరకు రాలేదని, ఇకపై రాదని అంటూ తన కెరీర్లోని ముఖ్య వ్యక్తిలందరినీ గుర్తుచేసుకున్నారు.

కానీ తనకు మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ ను గుర్తుచేసుకోలేదు. అయితే ఇది అనుకోకుండా జరిగిందే కానీ రావిపూడి ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు. ఈ విషయాన్నే ట్విట్టర్ ద్వారా తెలిపిన రావిపూడి తన మొదటి హీరో, నిర్మాత కళ్యాణ్ రామ్ గారిని గుర్తు చేసుకోవడం మర్చిపోయానని, అది అనుకోకుండా జరిగిందని అంటూ జనవరి 15న విడుడలకానున్న ఆయన చిత్రం ‘ఎంత మంచివాడవురా’ పెద్ద హిట్టవ్వాలని కోరుకున్నారు.

Exit mobile version