ఐపీఎల్ చూడండి…తర్వాత టైమ్ ఉంటే మా సినిమాలు చూసి ఎంకరేజ్ చేయండి – అనీల్ రావిపూడి

టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ చిత్రాలు తీసిన డైరెక్టర్ అనీల్ రావిపూడి. చివరిసారి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి చిత్రం ప్రేక్షకులను, అభిమానులని అలరించింది. అంతేకాక బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. అయితే ఈ డైరెక్టర్ ఇటీవల కృష్ణమ్మ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

అయితే వాటికి క్లారిటీ ఇస్తూ, అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ మాటలు అన్నందుకు క్రికెట్ ఫ్యాన్ గా తను కూడా హార్ట్ అయినట్లు తెలిపారు. ఆయితే ఈవెంట్ కి అటెండ్ అయ్యే ముందే, ఒక డిస్ట్రిబ్యూటర్ ను కలిసినట్లు తెలిపారు. సినిమాలకి ఎవరూ రావట్లేదు, చిన్న చిత్రాలు బాగా ఆడాలి అని తెలిపిన వ్యాఖ్యలను వెల్లడించారు. ఆ టైమ్ కి అలా మాట్లాడాను అని, ఎవరిని హార్ట్ చేయాలని కాదు అని అన్నారు. అంతేకాక తను ఇచ్చిన స్టేట్మెంట్ ను కరెక్ట్ చేస్తూ, ఐపీఎల్ చూడండి, తర్వాత టైమ్ ఉంటే మా సినిమాలు చూసి ఎంకరేజ్ చేయండి అని అన్నారు.

Exit mobile version