సినీ పరిశ్రమ వారికీ చాలా మంది కేవలం ఒక్క ట్రాక్ లోనే కాకుండా టాలెంట్ ఉంటే ఇతర ట్రాక్ లలో కూడా రాణించినవారు ఉన్నారు. అలానే మొదట ఒక ట్రాక్ లో సెట్ అయ్యి అందులోనే సక్సెస్ చూసి కొన్ని పరిస్థితులు ప్రభావం మూలాన ఇతర ట్రాక్ లలోకి వెళ్లి చేతులు కూడా కాల్చుకున్నవారు లేకపోలేరు. మరి దీనిని తెలుసుకున్నవారు డెఫినెట్ గా మరింత సక్సెస్ లతో ముందుకు వెళతారు.
అయితే సరిగా ఇదే స్ట్రాటజీని అనీల్ రావిపూడి (Anil Ravipudi) ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు. తెలుగులో రాజమౌళి తర్వాత వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న దర్శకునిగా అనీల్ రావిపూడి (Anil Ravipudi) సాలిడ్ హిట్ ట్రాక్ సెట్ చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అంతా అనీల్ రావిపూడికి ఎదురవుతున్న ప్రశ్న ఏదన్నా ఉంది అంటే అది హీరోగా తన ఎంట్రీ ఎప్పుడు అంటూ..
అయితే దీనిపై ముందు అంతగా రెస్పాండ్ కాని అనీల్ రావిపూడి (Anil Ravipudi) లేటెస్ట్ గా మాత్రం క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలని మనం ఒక ట్రాక్ లో సూపర్ సక్సెస్ గా దూసుకెళ్తున్నపుడు పక్కకి లాగడానికి ఇలాంటివి కొన్ని ఎదురవుతూ ఉంటాయని కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాలని పొరపాటున అటు గాని వెళ్తే మన పని అయిపోయినట్టే అని క్లియర్ సందేశం ఇచ్చేసారు. సో తన పని మీద తాను క్లారిటీగా ఎప్పుడు ఏం చెయ్యాలి అనే స్పృహలోనే ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మెగాస్టార్ తో చేసిన మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ పనుల్లో తాను బిజీగా ఉన్నారు.
