ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై, ఆయన టీమ్ పై ఇటీవల బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అయిన కావేరి బారువా కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అల్లు అర్జున్ను కలవాలంటే 42 కఠినమైన నిబంధనలు పాటించాలంటూ ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణలపై బన్నీ టీమ్ తీవ్రంగా స్పందిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో కావేరి బారువా మరియు పాడ్‌కాస్టర్ స్వీకృతి తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాము చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అసలు అల్లు అర్జున్ టీమ్ అటువంటి ‘42 రూల్స్’ డాక్యుమెంట్‌ను తమకు ఎప్పుడూ ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు.
కావేరి బారువా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఫ్లోలో చేసిన ఆ వ్యాఖ్యలు తప్పుడు సమాచారం పై ఆధారపడినవి. అల్లు అర్జున్ గారిపై నాకు ఎంతో గౌరవం ఉంది. నా వ్యాఖ్యల వల్ల ఆయన ప్రతిష్టకు కలిగిన నష్టానికి నేను చింతిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ వివాదాస్పద పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌ను ఇంటర్నెట్ నుండి పూర్తిగా తొలగించారు.
