మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఇక ఈ సినిమాను హిట్ మిషన్ దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి.
దీంతో ఈ సినిమాకు సంబంధించి ‘మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్’ను నిర్వహించారు. ఈ మీట్‌లో విలేకరులు అనిల్ రావిపూడిని ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. ఈ సినిమాలో వినియోగించిన ‘దళపతి’ మూవీలోని సాంగ్ బిట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని.. అయితే ఇళయరాజా గారు గతంలో కొన్ని సినిమాలపై కేసులు వేశారని.. తమ సినిమాకు అలాంటి ఇబ్బంది ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా..? అని అనిల్ రావిపూడిని ప్రశ్నించారు.
అయితే, దీనికి సమాధానమిస్తూ అనిల్ రావిపూడి.. ఏదైనా ఓ పద్ధతిగా చేయాలి. రాజాగారిని తమ నిర్మాతలు కలిశారని.. వారు ఆయన పాటను చిరంజీవి సినిమాలో వాడుకుంటామని అడిగారని.. దానికి రాజాగారు ఓకే చెప్పారని తెలిపారు. దీంతో ఇళయరాజా సాంగ్‌ను ఆయన అనుమతితోనే తమ సినిమాలో వాడుకున్నామని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.
