అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్: వెంకీ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..?

Venkatesh and Anil Ravipudi

టాలీవుడ్ హిట్ మెషిన్ దర్శకుడు అనిల్ రావిపూడి, బాక్సాఫీస్ వద్ద తన అన్-బీటెన్ రికార్డును కొనసాగిస్తున్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించడంలో విజయం అందుకుంటున్నాడు. ఇప్పటివరకు అపజయం ఎరుగని ఈ యంగ్ డైరెక్టర్, ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. గతంలో అనిల్ రావిపూడికి ‘పటాస్’తో దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది కళ్యాణ్ రామ్ కాగా.. F2, F3 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది వెంకటేష్. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలను ఒకే స్క్రీన్‌పై చూడబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా దగ్గుబాటి – నందమూరి కాంబినేషన్ అనగానే టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 2026 చివరి వారం నుండి ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు షెడ్యూల్స్‌లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ వినోదాన్నే నమ్ముకునే అనిల్, ఈసారి ఈ ఇద్దరు హీరోలతో ఏ జానర్ కథను టచ్ చేస్తారో చూడా.

Exit mobile version