మోస్ట్లీ మహేష్ బాబుతోనే సినిమా అంటున్న డైరెక్టర్

Mahesh ANil
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే సీనియర్ దర్శకులకే చాలా కష్టం. ఎంతో ఆలోచించి కానీ మహేష్ డేట్స్ ఇవ్వరు. అలాంటిది నాల్గవ సినిమానే ఆయనతో చేసే ఛాన్స్ కొట్టేశారు అనిల్ రావిపూడి. వచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ‘సరిలేరు నీకెవ్వరు’ రూపంలో మంచి విజయాన్ని అందుకుని స్టార్ డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వెంకీ, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ‘ఎఫ్ 3’ చిత్రాన్ని చేస్తున్నారు.

ఆ సినిమా తర్వాత ఆయన చాలా మందితో సినిమాలు చేయాలని అనుకున్నారు. బాలకృష్ణ లాంటి హీరోలు రావిపూడి జాబితాలో ఉన్నారు. మహేష్ బాబు అయితే మొదటి ప్రియారిటీ. అయితే ఎవరితో అనేది ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అనిల్ సైతం ఖచ్చితంగా పలానా హీరోతో అని చెప్పలేకున్నారు. కానీ మోస్ట్లీ మహేష్ బాబుతోనే ఆయన సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయట. అవి గనుక సక్సెస్ అయితే వెంటనే సినిమాను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Exit mobile version