మన టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ పెద్ది కూడా ఒకటి. మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాలో అనేకమంది పవర్ఫుల్ నటులు భాగం అయ్యిన సంగతి తెలిసిందే.
మరి ఈ నటుల్లో జగపతిబాబు, శివ రాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యెందు శర్మ, ఇంకా చాలామంది స్టార్ కాస్ట్ ఉండగా వీరితో పాటుగా మరో టాలెంటెడ్ పవర్ హౌస్ నటుడు కూడా ఉన్నట్టు ఇప్పుడు ఖరారు అయ్యింది. మరి అతనే ఉపేందర్ లిమాయె.
బాలీవుడ్ భారీ హిట్ చిత్రం అనిమల్ లో క్రేజీ రోల్ లో పాపులర్ అయ్యిన తాను ఇటీవల తెలుగులో ఓజి, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాల్లో కూడా మంచి పాత్రలు దక్కించుకున్నారు. ఇక వాటితో పాటుగా ఇప్పుడు పెద్ది లో కూడా కీలక పాత్రే పడినట్టుగా లేటెస్ట్ వీడియోలో చూస్తే అర్ధం అవుతుంది. మరి తన రోల్ ఎలా ఉండబోతుందో చూడాలి.
