ఇప్పుడు మన సౌత్ సినిమా దగ్గర ఫుల్ ఫామ్ లో ఉన్న పాపులర్ సంగీత దర్శకుల్లో ఎస్ ఎస్ థమన్ అలాగే అనిరుద్ లు కూడా ఒకరు. టాలీవుడ్ ని ఒకరు అలాగే కోలీవుడ్ ని ఒకరు రూల్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి కలయికలో ఒకే సినిమాకి వర్క్ చేసినవి కూడా ఉన్నాయి. కానీ కంపొజిషన్ కాకుండా థమన్ సినిమాలకి అనిరుద్ పాటలు పాడడం జరిగింది. ఇక లేటెస్ట్ గా అనిరుద్ తో థమన్ ఓ పోస్ట్ షేర్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో కేజ్రీగా మారింది.
‘నన్బా ఇక మొదలెడదామా’ అంటూ చేసిన పోస్ట్ తో చాలా మంది ఇదేదో పెద్దదే ప్లాన్ చేస్తున్నారని ఎగ్జైట్ అయిపోతున్నారు. కానీ నిజానికి అక్కడ అంత ఎగ్జైట్ అవ్వాల్సిన పని లేదని టాక్ వినిపిస్తుంది. ఈసారి కూడా అనిరుద్ తో పాటను మాత్రమే పాడించుకుంటున్నట్టు టాక్. సో ఇద్దరు కలిసి ఓ సినిమా సంగీతం అందిస్తున్నారా? అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే.. అలాగే అనిరుద్ తో ఓ మిడ్ రేంజ్ సినిమాకి థమన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దీనిపై మున్ముందు అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
Nannnnnba @anirudhofficial Ika Modaledadhama 🫠
— thaman S (@MusicThaman) May 26, 2026


