టాక్ ఆఫ్ ది టౌన్ అయిన అనిషా అంబ్రోస్

Anisha-Ambrose
ప్రస్తుతం అన్ని చోట్ల సందడి చేస్తున్న పేరు అనిషా అంబ్రోస్. ఈ అందమైన టాలెంటెడ్ అమ్మాయి ‘గబ్బర్ సింగ్ 2’ లో పవన్ కళ్యాణ్ సరసన నటించే అధ్బుతమైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. అనిషా పవన్ సరసన నటించనుందనే విషయం తెలిసినప్పటినుండి అందరి మది లో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి.

ఒక కొత్త నటి సినిమాలో ఎంతో ముఖ్యమైన పాత్రని సాధించడం ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తుంది. పవన్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సామాన్యమైన విషయం కాదు. ఈ అవకాశాన్ని పొందిన అనిషా కి చాలా మంచి బ్రేక్ లభించిందనే చెప్పాలి. అనిషా గతంలో ‘అలియాస్ జానకి’ అనే చిత్రం లో నటించింది. ‘గబ్బర్ సింగ్ 2’ ద్వారా అనిషా కి విజయం చేకూరాలని ఆశిద్దాం.

Exit mobile version