ఆత్మరక్షణలో అంజలి

Anjali
ప్రస్తుతం తెలుగు నాయిక అంజలి తనకు జరిగిన అవమానాలని మరిచిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇటీవలే కొందరు ఆకతాయులు పెట్టిన ఫోటోలు ఈ భామ పేరును పాడుచెయ్యడమే కాక ఫ్యామిలీ హీరోయిన్ ముద్రని కూడా చెరిపేస్తున్నారు. వీటికి తోడు అంజలి కొంతమంది తమిళ దర్శకులతో అంజలి కోర్టు వ్యవహారాలలో నలుగుతుంది

వీటివలన నిస్సహాయతకు లోనైనా అంజలి వాటినుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. తన అసభ్యకర ఫోటోలను నివారించేందుకు తన ఐడి కూడా ప్రెస్ కి ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఏ పెద్ద సినిమా లేదు. కోన వెంకట్ తీస్తున్న సినిమా మాత్రమే ఈ అమ్మడి భవిష్యత్ ని నిర్ణయించనుంది

Exit mobile version